జాతీయ రాజకీయాల్లోకి పవన్.. మాయతో భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

జాతీయ రాజకీయాల్లోకి పవన్.. మాయతో భేటీ

October 24, 2018

జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ జాతీయ రాజకీయాలపై కన్నేశారు. ఏపీలో తామే గెలుస్తామనే ధీమాతో ఉన్న ఆయన కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన ఈ రోజు బీఎస్పీ చీఫ్ మాయావతితో భేటీ కావడానికి లక్నో వెళ్లారని చెబుతున్నారు.

Janasena chief Pawan Kalyan to meet BSP Chief Mayawati eyeing on to play a key role in national politics and third front against Congress and BJP

మాయావతి..కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుంటున్న నేపథ్యంలో పవన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ ఎలాంటి ముందస్తు లీకులు ఇవ్వకుండా లోక్నో విమానం ఎక్కారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పలువురు నేతలు మూడో కూటమి ఏర్పాటుకు యత్నిస్తున్న నేపథ్యంలో పవన్ ప్రయాణయమ్యారు. మూడో కూటమి తరఫన ప్రధానమంత్రి అభ్యర్థిగా మాయావతి పేరు తెరపైకి రావడం,  బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి విధిలేని పరిస్థితిలో కాంగ్రెస్ కూడా ఆమెకు మద్దతిస్తుందనే ప్రచారం నడుప పవన్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనే దానిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. పవన్.. మాయావతితోపాటు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌తోనూ భేటీ కానున్నారని తెలుస్తోంది. పవన్ వెంట మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్  కూడా ఉన్నారు.

తెలంగాణలో పోటీపై అందుకే స్పందించడం లేదు..

తెలంగాణలో 25 స్థానాల్లో జనసేన పోటీచేయాలని మొదట్లో అనుకున్నామని, పోటీపై నాలుగు రోజుల్లో ప్రకటన చేస్తానని పవన్ ఈ నెల 13న చెప్పడం తెలిసిందే. అయితే తర్వాత ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ నిర్మాణానికి యత్నిస్తుండడంతో పవన్ తెలంగాణ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ పనితీరు చాలా బాగుందని పవన్ పలుసార్లు కీర్తించడం తెలిసిందే.