భారత్ మాతాకీ జై.. అయోధ్య తీర్పుపై పవన్ - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ మాతాకీ జై.. అయోధ్య తీర్పుపై పవన్

November 9, 2019

వివాదాస్పద అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మిశ్రమ స్పందన లభిస్తోంది. భూమిని హిందువులకు అప్పగించి, మసీదు కోసం మరో స్థలాన్ని ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలను హిందూ సంఘాలు సహజంగానే ఆహ్వానిస్తుండగా కొన్ని ముస్లిం సంస్థలు నిరసన తెలుపుతున్నాయి. మసీదు కూలగొట్టకుండా ఉండుంటే సుప్రీం కోర్టు తీర్పు ఎలా వచ్చి ఉండేదని ఎంఐఎం  నేత అసదుద్దీన్ ప్రశ్నించారు. అయితే చాలా కాంగ్రెస్ సహా పార్టీలు తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తీర్పుపై స్పందించారు. ఇది ధర్మాన్ని ఎత్తపట్టే తీర్పు అని కొనియాడారు. 

‘స్వాంతన కలిసిగస్తూ ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. భారత న్యాయవ్యవస్థక ఉన్న పూర్ణ  విజ్ఞతకు ఇది అద్దం పడుతోంది. ధర్మాన్ని ఎత్తిపట్టిన కోర్టు తీర్పును. మన భారతీయులందరూ హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారు. భారత్ మాతాకీ జై’ అని ఆయన ట్వీట్ చేశారు.