janasena chief pawan kalyan wishes women's on international women's day
mictv telugu

International Women’s Day : అడవాళ్ల రుణం తీర్చలేనిది..పవన్ కళ్యాణ్

March 8, 2023

janasena chief pawan kalyan wishes women's on international women's day

Pawan Kalyan : ఆడపడుచులందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ” శక్తి స్వరూపిణి స్త్రీ..బహుకృత రూపిణి స్త్రీ..బహుముఖ ప్రజ్ఞాశాలి స్త్రీ..మానవ సృష్టికి మూలకారిణి స్త్రీ. ఇంతటి మహోన్నతమైన స్త్రీకి మనం ఏమిస్తే రుణం తీరుతుంది. తల్లిగా.. తోబుట్టువుగా..భార్యగా..బిడ్డగా..బిన్న రూపాలలో మన మధ్య ఉన్న స్త్రీమూర్తి సేవలు వెలకట్టలేనివి. మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల లాంటింది. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అని పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పుకుంటామని..అది అక్షరాలా నిజం అని అన్నారు. స్త్రీలను గౌరవించే చోట శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయని తాను ధృడంగా విశ్వసిస్తానన్నారు జనసేన అధినేత. అయితే స్త్రీలు సంపూర్ణ సాధికారత సాధించడానికి, స్వేచ్ఛగా జీవించడానికి సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని జనసేనాని డిమాండ్ చేశారు. అంతే కాదు ఇదే అంశాన్ని మా పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచామని తెలిపారు.