కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతా.. పవన్ కల్యాణ్ - MicTv.in - Telugu News
mictv telugu

కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతా.. పవన్ కల్యాణ్

October 15, 2018

తాను ముఖ్యమంత్రిని కావడం ఖాయమని, ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమాగా చెప్పారు. ఈ రోజు రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ తీవ్రంగా విమర్శిస్తూ భావోద్వేగంతో మాట్లాడారు. పదవికి వారసత్వం ముఖ్యం కాదని, ప్రజల అభిమానం ముఖ్యమని అన్నారు.

yy

‘‘సీఎం పదవి నాకు అలంకారం కాదు. చంద్రబాబు, లోకేశ్లాగా వారసత్వం కాదు.. ప్రతిపక్ష నేత జగన్లా నా తండ్రి సీఎం కనుక నేను కూడా సీఎం కావాలన్న ఆశ నాకు లేదు. నేనే సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న  కానిస్టేబుల్. కింది నుంచి పైకెదిగిన వ్యక్తి. చిన్న జీవితం నాది. మా తాత, నాన్న సీఎం అయ్యారు కనుక నేనూ అవుతా అని లోకేశ్ అనుకున్నప్పుడు.. మా నాన్న సీఎం అయ్యారు కనుక నేనూ అవుతా అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నప్పుడు ఒక కానిస్టేబుల్గా జీవితం ప్రారంభించిన వ్యక్తి కొడుకు రాష్ట్రానికి ఎందుకు సీఎం కాలేడు. కచ్చితంగా అవుతాడు.. నేను ఒక మునసబు మునిమనవణ్ని.. పోస్ట్‌మేన్ మనవణ్నికానిస్టేబుల్ కొడుకును.. ఎందుకు ముఖ్యమంత్రి కాలేను? మా అన్నదమ్ములం చేయని  తప్పులకు నెలలు నెలలు అనుమానాలు ఎదుర్కొన్నాం. మా తల్లిని తిట్టించుకున్నాం.. పౌరుషం లేదా మాకుఉప్పుకారం తినలేదా మేముపౌరుషాలు మీకేనాఆకాశం నుంచి ఊడిపడ్డారా?’ అని విమర్శించారు.

కవాతు ఎందుకంటే?

మన దేశంలో మిలటరీ సైనికులే తప్ప భారత ప్రజలు కవాతు చేయరని పవన్ అన్నారు. అయితే  సగటు రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయి అవినీతితో నిండిపోయిందని, దీంతో  నిరుద్యోగంతో రగిలిపోతున్న యువత జనసేనతో కలసి కవాతు చేసిందని అన్నారు. ఇది అవినీతి, దోపిడీనీ అంతమొందించే కవాతన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ‘విజన్ 2020లో రెండు కోట్ల ఉద్యోగాలన్నారు.. అవెక్కడ? నాను పొరపాటున 2014లో వారికి మద్దతిచ్చాను. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారని  భావించాను.  ఓట్లను చీల్చడం ఇష్టంలేక పోటీ చేయలేదు’ అని వివరించారు.