భవన నిర్మాణ కూలీల కోసం జనసేన అన్నదాన శిబిరాలు - MicTv.in - Telugu News
mictv telugu

భవన నిర్మాణ కూలీల కోసం జనసేన అన్నదాన శిబిరాలు

November 9, 2019

ఏపీలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణరంగ కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. చేతిలో ఉపాధిలేక కొంత మందికి పూట గడవటమే కష్టంగా మారింది. ఈ పరిస్థితి గమనించిన జనసేన పార్టీ ఉపాధి కూలీలకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చింది. దీని కోసం వారికి అన్నధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాన్ నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. 

Janasena.

ఈనెల 15,16 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్నార్థుల కోసం ఎంతో మందికి భోజనం పెట్టిన డొక్కా సీతమ్మ స్పూర్తితో దీన్ని చేపట్టనున్నారు. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాల పేరుతో నిర్వహించనున్నట్టు పవన్ కల్యాన్ పేర్కొన్నారు. అడ్డా కూలీలు ఉండే ప్రాంతం వద్దకే వెళ్లి వారికి భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. నెలల తరబడి పనులు లేకుండా ఉంటున్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్నం లేక ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాలకు ఉచితంగా ఆహారం అందించాలన్నారు. కూలీలకు జనసేన అండగా ఉంటుందని ఆయన  వెల్లడించారు.