పశువులని, ప్యాకేజీ కుక్కలని రచ్చరచ్చ.. ఏపీ మంత్రిపై నాగబాబు వ్యాఖ్యతో దుమారం   - MicTv.in - Telugu News
mictv telugu

పశువులని, ప్యాకేజీ కుక్కలని రచ్చరచ్చ.. ఏపీ మంత్రిపై నాగబాబు వ్యాఖ్యతో దుమారం  

May 22, 2020

Janasena leader nagababu tweet on minister Avanti srinivas

నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడని కీర్తించి వివాదంలో చిక్కుకున్న జనసేత నేత, సినీనటుడు నాగబాబు ఈ రోజు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై విమర్శలు చేశారు. శ్రీనివాస్ పశువులకు గడ్డి వేస్తున్న ఫొటోను పోస్ట్ చేసి ‘అన్ని అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను..’ అని కామెంట్ పెట్టాడు. శ్రీనివాస్ తన రాజకీయ జీవితాన్ని చిరంజీవి పార్టీ ప్రజారాజ్యంతో ప్రారంభించిన నేపథ్యంలో నాగబాబు ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. వైకాపా శ్రేణులు ఎదురు దాడి చేస్తున్నాయి. ‘అవును కొన్ని కుక్కలు ప్యాకేజీ తింటూ బానిసత్వం చేస్తాయి..’ అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. ‘మీరైతే గడ్డి తినరు కదా’, ‘మనుషులు గడ్డి తినడం ప్రారంభించాక పశువులు గడ్డి తినడం మానేశాయి.. ’ అని ఎద్దేవా చేస్తున్నారు. 

అసలేం జరిగింది? 

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ తర్వాత స్థానికులను పరామర్శించడానికి వెళ్లిన అవంతి శ్రీనివాస్ పశువులకు గడ్డి వేశారు. ఈ ఫోటోను నాగబాబు ట్వీట్ చేశాడు. అన్ని పశువులు గడ్డి తినవు అనే కామెంట్ వెనక అవంతి శ్రీనివాస్ రాజకీయ జీవితాన్ని టార్గెట్ చేసినట్లు వైకాపా శ్రేణులు భావిస్తున్నాయి. శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి భీమిలి నుంచి గెలిచారు. తర్వాత చిరు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలపడంతో శ్రీనివాస్ కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరారు. తర్వాత వైకాపాలో చేరి మంత్రి అయారు.