‘
‘అపజయంలోనే విజయం ఉంటుంది. ఏది ఒప్పో, ఏది తప్పో పరిశీలించి తెలుసుకోవాలి. అందర్నీ గుడ్డిగా నమ్మకూడదు,’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన శనివారం హైదరాబాద్లో చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సదస్సులో సీఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాజకీయాల్లో తాను ఓడిపోయానని, అలా చెప్పడానికి ఏమాత్రం మొహమాటపడడం లేదని అన్నారు. ‘‘నేను ఓడిపోయిన రాజకీయ నాయకుడినని ఒప్పుకుంటున్నా. నా ఓటముల గురించి నిర్భయంగా మాట్లాడతాను. ఓటమిలోనే గెలుపు ఉంటుంది. మీరు ఎవర్నీ గుడ్డిగా నమ్మకండి. చివరికి దేవుణ్ని కూడా అలా నమ్మకండి. డబ్బులు ఉన్నవాళ్లందరూ మహానుభావులని భావించకండి. ఏది సరైందో, ఏది తప్పో నిర్ణంచుకోండి. విజయం సాధించామని పొంగిపోవద్దు. నేను నా పరాజయాల గురించి బాధపడను. ఓటమని సానుకూల దృక్పథంతో చూస్తాను’’ అని అన్నారు పవన్ కల్యాణ్.