మంత్రి ఇంటి ముందు తొడగొట్టిన జనసైనికులు.. వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రి ఇంటి ముందు తొడగొట్టిన జనసైనికులు.. వీడియో

November 12, 2022

ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా ఇంటి ముందు జనసేన నాయకులు, కార్యకర్తలు తొడగొట్టారు. ర్యాలీగా వెళ్తున్న జనసైనికులు.. ఓ వైపు వర్షం పడుతున్నా ఆగకుండా జై జనసేన అంటూ నినదించారు. వివరాల్లోకెళితే.. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో జనసేన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇంజార్జీ కిరణ్ రాయల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను నగరి కోర్టులో హాజరుపరచగా, కోర్టు 41ఏ నోటీసు ఇచ్చి బెయిల్ మంజూరు చేసింది.

 

దీంతో బెయిల్‌పై విడుదలయిన కిరణ్.. పార్టీ శ్రేణులతో కలిసి నగరిలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ర్యాలీ మంత్రి రోజా ఇంటి ముందుకు చేరుకోగా, జనసైనికులు కాసేపు ఆగి తొడగొట్టారు. తొడకొట్టిన వారిలో కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, ఓ మహిళా నేతతో పాటు కార్యకర్తలు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేతలు ట్విట్టర్‌లో విడుదల చేశారు.