జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసీపీపై సెటైరికల్ కార్టూన్ రూపొందించారు. సంపూర్ణ మద్య నిషేధం వైసీపీ మేనిఫెస్టోలో లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జనసేన ఈ విధంగా కౌంటరిచ్చింది. ‘మద్యం మిథ్య.. నిషేధం మిథ్య.. తాగమని, తాగొద్దని చెప్పడానికి మనమెవరం.. అంతా వాడిష్టం’ అని సీఎం జగన్ ఓ పేద మహిళకు హితబోధ చేస్తున్న కార్టూన్ విడుదల చేసింది. నిన్నటివరకూ ఏపీలోని రోడ్ల మీద సెటైర్లు వేసిన పవన్.. ఇప్పుడు మద్యంపై వైసీపీ తీరును ఈ విధంగా ఎండగట్టారు.