జిల్లాల్లో  ‘జనసేన’ - MicTv.in - Telugu News
mictv telugu

జిల్లాల్లో  ‘జనసేన’

October 28, 2017

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌లో ‘జనసేన’ పార్టీ కార్యాలయాన్ని ఈమధ్యే ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీలైనంత తొందరలో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో, ‘జనసేన’ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నాడట.

హైదరాబాద్‌, అమరావతిలో ఐదెకరాల విస్తీర్ణంలో పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. కార్యాలయాల ఏర్పాటు బాధ్యతలు పార్టీలోని ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులకు పవన్  అప్పగించాడు. ‘జనసేన’ కార్యాలయాల నిర్వహణకు, విధివిధానాల రూపకల్పన చేస్తామని ఈసందర్భంగా పవన్ చెప్పాడు.