అమ్మకానికి జనసేన మంగళగిరి పార్టీ ఆఫీసు.. వంద కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మకానికి జనసేన మంగళగిరి పార్టీ ఆఫీసు.. వంద కోట్లు

May 10, 2022

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పార్టీకి ఇప్పటికే హైదరాబాదులో ప్రధాన ఆఫీసు ఉండగా, ఏపీలోని మంగళగిరిలోనూ పార్టీ ఆఫీసు ఉంది. దీనిని పవన్ కల్యాణ్ సొంత డబ్బు కోట్లు ఖర్చు పెట్టి కట్టించారు. ఇప్పుడీ పార్టీ ఆఫీసు ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి వచ్చింది. సుంకర మనోహర్ అనే వ్యక్తి రూ. 100 కోట్లకు ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. అడ్రస్ ఎర్రబలం, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ అని ఉంది. అమ్మకపు ప్రకటనతో పాటు ‘జనసేన పార్టీ పెట్టుకున్నాం కానీ, పక్క పార్టీ జెండాలు మోసే పాలేరు బతుకు ఇస్తున్నందువల్ల జనసేన పార్టీ ఆఫీసును అమ్మేస్తున్నాం’ అని రాసి ఉంది. కాగా, ఇది ఆకతాయి పనా, లేక ఒకవేళ పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడనే దానికి సంకేతంగా భావించి అధికార పార్టీ కార్యకర్తలెవరైనా ఈ చర్యకు పాల్పడి ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది.