పోటీ నుంచి తప్పుకున్న జనసేన.. బీజేపీతో రాజీ! - MicTv.in - Telugu News
mictv telugu

పోటీ నుంచి తప్పుకున్న జనసేన.. బీజేపీతో రాజీ!

November 20, 2020

pavanana

జీహెచ్ఎంసీ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం మధ్య సాగుతున్న చతుర్ముఖ పోరులోకి పవర్ స్టార్ పార్టీ జనసేన కూడా దూసుకొచ్చింది. ఎంత హఠాత్తుగా దూసుకొచ్చిందో అంతే వేగంతో వెనక్కి వెళ్లిపోయింది. ఎన్నికల్లో పోటలీ చేస్తామని నిన్న ప్రకటించిన పార్టీ ఈ రోజు అదంతా వట్టిదే అని షాకిచ్చింది. తమ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటారని అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. 

అంతకు ముందు జనసేన నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో బీజేపీ నేతలతో ఆయన చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకుడు లక్ష్మణ్… పవన్‌ను బుజ్జిగించి పోటీ నుంచి తప్పించారు. తొలుత పొత్తుపై చర్చలు జరిగాయని, తర్వాత పోటీ నుంచి తప్పుకోవడంపై చర్చించారని సమాచారం. ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ మంతనాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి జనసేనను బీజేపీ బరి నుంచి బయటికి పంపింది. హైదరాబాద్ అభివృద్ధి కోసం తాము బీజేపీతో కలిసి పనిచేస్తామని పవన్ చెప్పుకొచ్చారు. కార్యకర్తలతో మాట్లాడతామని, ఎవరూ డీలా పడిపోవద్దని  అన్నారు.