Janasena President Pawan Kalyan met TDP leader Chandrababu.
mictv telugu

చంద్రబాబుతో సమావేశమైన పవన్ కల్యాణ్

January 8, 2023

Janasena President Pawan Kalyan met TDP leader Chandrababu.

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకునే అవకాశముంది. దీంతో పాటు ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనలపైనా మాట్లాడుకునే వీలుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీరిద్దరూ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌-1పైనా తాజా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ తాజా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పొత్తుపై ఇప్పుడే ప్రకటించాలా? లేదా కొంతమంది వేచి ఉండాలా? అనే విషయంపై చర్చించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కలిసి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, ప్రతిపక్ష సభలపై ఆంక్షలు, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడుల గురించి చర్చించుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి. తాజా రాజకీయా అంశాలపై చంద్రబాబు, పవన్ చర్చించుకున్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు, పవన్‌లు పలుమార్లు భేటీ అయిన తర్వాత పొత్తుపై ప్రకటించారు.