ఏలూరులో జనసేనాని.. రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం - MicTv.in - Telugu News
mictv telugu

ఏలూరులో జనసేనాని.. రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం

April 23, 2022

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ‘జనసేన కౌలు రైతు భరోసా యాత్ర’లో భాగంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి రూ. లక్ష చొప్పున ఆర్ధిక సహాయం చేశారు. ఈ జిల్లాలో 41 రైతు కుటుంబాలకు సాయం అందించనున్నారు. ఇందుకు గన్నవరం చేరుకొని ఆతర్వాత విజయవాడ నుంచి జానంపేట మీదుగా పెదవేగి మండలం విజయరాయి, లింగపాలెం మండలం ధర్మాజీగూడెం ప్రాంతాల్లో పర్యటించి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా, అంతకుముందు వేలేరు, ఏలూరు వద్ద కలపర్రు వద్ద జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్ కల్యాణ్‌కు పూలు వెదజల్లుతూ ఘన స్వాగతం పలికారు.