మల్కాజ్‌గిరి బరిలోకి జనసేన అభ్యర్థి.. పవన్ ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

మల్కాజ్‌గిరి బరిలోకి జనసేన అభ్యర్థి.. పవన్ ప్రకటన

March 16, 2019

తెలంగాణలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి కమిటీ వేసి, అభ్యర్థుల నుంచి బయోడేటాలు ఆహ్వానిస్తున్న జనసేన పార్టీ తన తొలి అభ్యర్థిని ప్రకటించింది. మల్కాజ్‌గిరి నుంచి పార్టీ అభ్యర్థిగా వ్యాపారి, పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌ రెడ్డి పోటీ చేస్తున్నట్లు అధినేత పవన్ కల్యాణ్ ప్రటించారు.

Janasena telangana announces its first candidate mahender reddy.

ఈ రోజు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగింది. మహేందర్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్నిఖరారు చేశారు. ఆయన సమాజానికి సేవ చేయాలని, వ్యాపారాలను వదులుకుని పార్టీలోకి వచ్చారని పవన్ కొనియాడారు. గతంలో మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి మహేందర్ రెడ్డిని ప్రజారాజ్యం అభ్యర్థిగా ఎంపికచేశామని, అయితే ఆయన ట్రాఫిక్‌లో చిక్కుకొని నామినేషన్‌ వేయలేకపోయారని చెప్పారు. ఆ తప్పును దిద్దుకుంటూ ఆయనను మల్కాజ్‌గిరి అభ్యర్థిగా నిలిపాన్నారు.