తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ..అన్నీ బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ..అన్నీ బంద్

March 22, 2020

Janata curfew in telangana

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో జనతా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశ ప్రజలంతా కచ్చితంగా ఇళ్లలోనే ఉండాలని ప్రధాని సూచించిన సంగతి తెలిసందే. దీంతో దేశంలోని ప్రధాన నగరాలు అన్ని నిర్మానుష్యంగా ఉన్నాయి.

తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపిని సంగతి తెల్సిందే. దీంతో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని శ్రీ కొమురవెల్లి మల్లికార్జున దేవస్థానం మూసివేశారు. ఆలయం బయట భక్తులు, వ్యాపారులతో ఎప్పుడూ సందడిగా ఉండే ప్రాంగం బోసిపోయింది. చిరు వ్యాపారులు కూడా తమ దుకాణాలను స్వచ్ఛంగా మూసివేశారు. చార్మినార్ వద్ద అధికారులను సోడియం క్లోరైడ్‌తో శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ ప్రాంతంలో మొత్తం 11 టీమ్‌లు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు నగరమంతా ప్రత్యేక టీమ్‌లు ఈ శానిటేషన్ డ్రైవ్‌లో పాల్గొంటున్నట్లుగా తెలిపారు. నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ సందర్భంగా వీధులన్నీ వెలవెలబోతున్నాయి. రోడ్లపై తిరుగుతున్న వారిని పోలీసులు ఇళ్లకు పంపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సైరన్ మోగుతుందని.. ఐక్యతను చాటడం కోసం తన కుటుంబ సభ్యులంతా కలిసి ఆ సమయంలో చప్పట్లు కొడతామని సీఎం కేసీఆర్ తెలిపారు.