Jangaon: One died after having omelette stuck in his throat
mictv telugu

మద్యం తాగుతూ.. మధ్యలో ఆమ్లెట్ తింటుండగా..

November 4, 2022

Jangaon: One died after having omelette stuck in his throat

జనగామ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్యం తాగుతున్న వ్యక్తి గొంతులో ఆమ్లెట్‌ ఇరుక్కుపోవడంతో మృతి చెందాడు. జిల్లాలోని బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) అనే వ్యక్తి.. గురువారం మద్యం తాగడానికి స్థానిక వైన్ షాప్‌కి వెళ్లాడు.

తనకు కావాల్సిన మద్యం సీసాను కొన్న తర్వాత ఆ షాప్‌లోనే మద్యం సేవించేవారి కోసం ప్రత్యేకంగా కేటాయించిన గదిలోకి వెళ్లాడు. గదిలో కూర్చొని తెచ్చుకున్న మందు బాటిల్ ఓపెన్ చేసి తాగుతున్నాడు. మధ్యలో స్టఫ్ కోసం తాను తెచ్చుకున్న ఆమ్లెట్‌ తినసాగాడు. ఈ క్రమంలోనే ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో ఒక్కసారిగా షాప్ ముందు గుమిగూడారు. అసలు ఆ షాప్‌లో తాగడానికి అనుమతి ఉందా? ఆ ఆమ్లెట్ అతనికి ఎవరు ఇచ్చారు?అని ప్రశ్నిస్తున్నారు.