Janhvi and Sara Ali Khan dated with siblings
mictv telugu

అన్నదమ్ములతో డేటింగ్ చేసిన జాన్వీ, సారా అలీఖాన్.. వారెవరంటే

July 15, 2022

బాలీవుడ్‌లో యంగ్ బ్యూటీస్‌ ఇద్దరు జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ల గురించి దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సంచలన విషయం బయటపెట్టాడు. వీరిద్దరూ అన్నదమ్ములతో డేటింగ్ చేసిన విషయాన్ని వారి సమక్షంలోనే వెల్లడించాడు. దాంతో వారు సిగ్గుపడుతూ.. అయ్యో నిజం చెప్పేశావా అంటూ చిన్నబుచ్చుకున్నారు. ఇదంతా ఆయన నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’షోలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు హీరోయిన్లు అతిథులుగా రాగా, మొదట కరణ్.. నీకు ఎవరితో డేట్ చేయాలనుంది? అని సారాని అడుగుతాడు. దానికామె విజయ్ దేవరకొండ అని చెప్పగా, వెంటనే జాన్వీ సారాని చూస్తుంది. ఏంటి నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? అని అడిగింది. ఈ సంభాషణ ఇలా సాగుతుండగా, కరణ్ జోహార్ గతంలో వారిద్దరి డేటింగ్ వ్యవహారం గురించి మాట్లాడాడు. లాక్ డౌన్ సమయంలో ఈ ఇద్దరు హీరోయిన్లు అన్నదమ్ములతో డేటింగ్ చేశారని మాత్రమే చెప్పాడు కానీ, వారెవరో మాత్రం చెప్పలేదు. అయితే నెటిజన్లు వారెవరో కనిపెట్టేశారు. గతంలో వీరు దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. అన్నదమ్ముల పేర్లు వీర్ పహారియా, శిఖర్ పహారియా అని, వారిద్దరూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవళ్లని స్పష్టం చేశారు. దీంతో అదృష్టవంతులైన అన్నదమ్ములంటూ ఈ న్యూస్ వైరల్ అవుతోంది.