ప్రైస్‌ ట్యాగ్ చించడం మర్చిపోయిన హీరోయిన్.. నెటిజన్ల ట్రోల్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రైస్‌ ట్యాగ్ చించడం మర్చిపోయిన హీరోయిన్.. నెటిజన్ల ట్రోల్స్

October 23, 2019

సెలబ్రెటీలు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక వంకచూపి నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వేసుకున్న డ్రెస్సు నుంచి ప్రతి ఒక్కటి డేగ కళ్లతో కనిపెడుతూ వైరల్ చేస్తారు. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్, శ్రీదేవి కూతురు జాన్వికపూర్ కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయారు. ఇక్కడ ఆమె చేసిందల్లా వేసుకున్న దుప్పట్టాకు ప్రైస్ ట్యాగ్ చించకపోవడమే. దీన్ని చూసిన నెటిజన్లు ఎవరికి నచ్చినట్టుగా వారు కామెంట్లు పెడుతూ ట్రోల్స్ చేస్తున్నారు.

జాన్వికపూర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన కారులో బయటకు వెళ్లేందుకు వస్తుండగా అక్కడున్నవారు వీడియోను తీశారు. వారిని చూసిన జాన్వి నవ్వుతూ కారు వద్దకు వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమె ధరించిన  పసుపు రంగు సల్వార్ అందరిని ఆకర్షించింది. అయితే దుపట్టాకు ఉన్న ట్యాగ్ తీయడం మర్చిపోయారు. ఇది చూసిన నెటిజన్లు దీనిపై కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. జాన్వి ట్యాగ్ తీసేందుకు టైం వృథా చేయలేదని కొందరూ.. దుపట్టాతో పాటు ప్రైస్ ట్యాగ్ కూడా తీసుకెళ్తోందని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.