janhvi kapoor First Look Poster From Ntr30 Movie
mictv telugu

ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్.. అఫిషియల్ పోస్టర్ రిలీజ్

March 6, 2023

janhvi kapoor First Look Poster  From Ntr30 Movie

ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత తారక్‌ చేస్తున్న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ కోసం నందమూరి అభిమానులతోపాటు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో నటిస్తున్నారు. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా.. NTR 30వ ప్రాజెక్ట్‌గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో కథానాయికను చిత్రబృందం తాజాగా పరిచయం చేసింది.

ఈ సినిమాలో ఆనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌.. ఎన్టీఆర్‌కు జోడీగా కనిపించనుందని ప్రకటించింది. ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ షేర్‌ చేసింది. లంగాఓణిలో అచ్చు తెలుగమ్మాయిలా ఉన్న జాన్వీకపూర్‌ ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, అలలు జాన్వీని మరింత అందంగా కనిపించేలా చేస్తున్నాయి. తెలుగులో జాన్వీ కపూర్‌ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై జాన్వి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ‘‘ఎట్టకేలకు ఇది జరుగుతోంది. నేను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని ఆమె పేర్కొంది.

ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వికపూర్‌ నటించననున్నట్లు గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది. ఆ వార్తలే నిజమయ్యాయి. ఇక ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా గ్రాండ్‌ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. సముద్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఐలాండ్ & పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగనుందని తెలుస్తోంది.