Janhvi Kapoor says her social media presence helps her 'pay for her EMIs
mictv telugu

నా ఈఎంఐలని ఇలా ఈజీగా కట్టేస్తా.. జాన్వీ కపూర్

November 8, 2022

Janhvi Kapoor says her social media presence helps her 'pay for her EMIs

శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది జాన్వీ కుమార్. అందుకు ఆమె ఎంచుకుంటున్న కథలే నిదర్శనం. లేడీ ఓరియెంటెడ్, ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ.. పక్కింటి అమ్మాయిలా పేరు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం ‘మిలీ’. నవంబర్ 4న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో హాట్ పిక్స్‌పై స్పందించింది.

సినిమాల్లో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ పోస్ట్ చేయడంపై అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానమిచ్చింది. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ రెండు వేర్వేరు అని చెబుతూ.. సోషల్ మీడియాను తాను బాగా ఎంజాయ్ చేస్తానని తెలిపింది. అందులో పోస్ట్ చేసే ఫోటోల్లో తాను క్యూట్‌గా కనిపిస్తే అదనంగా మరో ఐదుగురు లైక్ కొడతారని చెప్పింది. దాని వల్ల తనకు కొత్తగా మరో బ్రాండ్‌ అడ్వార్టైజ్‌మెంట్ వస్తుందని, ఇక ఆ డబ్బుతో తన ఈఎంఐలను సులభంగా కట్టగలుగుతానని జాన్వీ తెలిపింది.