Japan held contests to increase liquor sales
mictv telugu

తాగుబోతులను పెంచేందుకు ఐడియాలివ్వండి : జపాన్ ఆదేశం

August 20, 2022

Japan held contests to increase liquor sales

ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలు చమురు, లిక్కర్, వస్తూత్పత్తి సేవలపై పన్ను వసూలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. ఇంకా కావాలంటే పన్నులు పెంచుతాయే తప్ప తగ్గించవు. అయితే ఇదంతా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు చేసే పని. కానీ, ఆర్ధికంగా ఉన్నతంగా ఉన్న దేశం, క్రమశిక్షణకు మారుపేరుగా పేరు గాంచిన జపాన్ ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు సమాజంలో తాగుబోతులను పెంచాలని భావిస్తోంది.

ముఖ్యంగా యువతకు ‘మందు’ అలవాటు చేసే ఐడియాలు చెప్పాలంటూ ఏకంగా ప్రజలకే పోటీలు నిర్వహించింది. సాధారణంగా మద్యానికి దూరంగా ఉండే జపాన్‌లో కోవిడ్ ప్రభావం, కెరీర్‌పై యువత ఫోకస్, జీవన వ్యయాలు పెరిగిపోవడంతో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయట. గతంలో ఏడాదికి ఒక వ్యక్తి సగటున 100 లీటర్ల మద్యం తీసుకోగా 2020 నాటికి అది 75 లీటర్లకు పడిపోవడంతో స్పందించిన అక్కడి ఆబ్కారీ శాఖ ‘సేక్ వివా’ పేరిట యువతకు ఐడియాల పోటీలు నిర్వహించింది. ఇందులో 20 నుంచి 39 ఏళ్ల వారు అర్హులని నవంబర్ 10న విజేతలను ప్రకటిస్తామని పేర్కొంది.