వరదల్లో తేలియాడే ఇల్లు కనిపెట్టిన జపాన్.. అసోంకు అనుకూలం - MicTv.in - Telugu News
mictv telugu

వరదల్లో తేలియాడే ఇల్లు కనిపెట్టిన జపాన్.. అసోంకు అనుకూలం

June 29, 2022

భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు అడ్డొచ్చిన ఇల్లు, భవనాలు వంటివి కొట్టుకుపోవడం చూస్తుంటాం. ఇప్పుడు ఈశాన్య భారతంలోని అసోంలో ఇదే పరిస్థితి. చాలా మటుకు భవనాలు కొట్టుకుపోయాయి. కాలువ ఒడ్డున ఉన్న పోలీస్ స్టేషన్ కూడా వరదల ధాటికి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ కూడా తరచూ భూకంపాలు, వరదలు వస్తుండడంతో భారీ ఎత్తున ఆస్తినష్టం జరుగుతోంది. దీనిని నివారించడానికి ఆ దేశ శాస్త్రవేత్తలు వరదలు వచ్చినా తట్టుకునేలా ప్రత్యేకమైన ఇంటిని నిర్మించారు. ఈ ఇంటి చుట్టూ ఎంత వరదొచ్చినా ఇంట్లోకి మాత్రం ఒక్క చుక్క నీరు రాదు. వాటర్ ప్రూఫ్ సౌలభ్యం ఉన్న ఈ ఇల్లు వరద వచ్చినప్పుడు ఐదు మీటర్ల వరకు పైకి తేలుతుంది. అంతేకాక, వరదల్లో కొట్టుకుపోకుండా ఉండేందుకు కేబుల్స్‌తో కట్టేస్తారు. ఐరన్ రాడ్డులతో నిర్మించిన ఈ ఇల్లును వారు ప్రాక్టికల్‌గా డెమొ చూపించారు. వరద వెళ్లిపోగానే ఇల్లు యథాస్థితికి వచ్చేస్తుంది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలకు బాగా పనికొచ్చే ఈ టెక్నాలజీ ఇల్లు చాలా మందిని నిరాశ్రయులు కాకుండా కాపాడుతుంది. ఆ వీడియో మీరూ చూసేయండి.