ఏం క్రేజ్ సామి! ఎన్టీఆర్‌ను చూసి ఏడ్చిన జపాన్ పాపలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏం క్రేజ్ సామి! ఎన్టీఆర్‌ను చూసి ఏడ్చిన జపాన్ పాపలు

October 22, 2022

తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజే వేరు. ఇప్పటి జనరేషన్ హీరోల్లో ఎన్టీఆర్ లాంటి యాక్టర్ లేడంటారు అతని అభిమానులు. భాషపై పట్టు, డాన్స్ ఎన్టీఆర్‌కి ప్రధాన ఎసెర్ట్స్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మేనియాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఎన్టీఆర్. బాలీవుడ్ మీడియాలో రాజమౌళి, రామ్ చరణ్ కంటే తారక్ కె మార్కులు ఎక్కువగా పడ్డాయి. దీనికి తోడు ఆస్కార్ నామినేషన్ కూడా ఎన్టీఆర్ క్రేజ్ ని రెట్టింపు చేసింది. వీటితో పాటు చరణ్ కంటే ఎన్టీఆర్ పాత్రలో హీరోయిజం తగ్గిందన్న సింపతీ కూడా అండర్ కరెంట్‌గా ఎన్టీఆర్ కి వర్కౌట్ అయింది. ఇక సాక్షత్తు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబద్‌లో ప్రత్యేకంగా ఎన్టీఆర్ ని కలవటం సంచలనంగా మారింది. దీంతో ఇవన్నీ కలగలిపి ఆర్ఆర్ఆర్ ద్వారా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్.

ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్ ఖండాలు సైతం దాటేసింది. తాజాగా జపాన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇందులో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ని చూసి జపాన్ యువతులు వెక్కి వెక్కి ఏడ్చేశారు. తమ టీ షర్ట్స్‌పై ఎన్టీఆర్ బొమ్మని అచ్చుపెట్టించుకుని ప్రమోషనల్ ఈవెంట్‌కి వచ్చారు ఎన్టీఆర్ జపాన్ ఫ్యాన్స్. ఇక వీరిని కలవడానికి ఈవెంట్ హోటల్ కి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వగానే భావోద్వేగం ఆపుకోలేకపోయారు. ఎన్టీఆర్ వారి పక్కన నిలబడి అత్యయంగా పలుకరిస్తూ.. ఫొటోలకి ఫోజులిచ్చాడు. జపనీస్ లో నాలుగు ముక్కలు మాట్లాడు. ఎన్టీఆర్ పక్కనే ఎమోషనల్ అవుతున్న ముగ్గురు జపాన్ పాపల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.