Earthquake: జపాన్, పాపువా న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం... జపాన్‎లో సునామీ హెచ్చరికలు..!! - MicTv.in - Telugu News
mictv telugu

Earthquake: జపాన్, పాపువా న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం… జపాన్‎లో సునామీ హెచ్చరికలు..!!

February 26, 2023

జపాన్‎లో భారీ భూకంపం సంభవించింది. హక్కైడో ద్వీపం తూర్పు భాగంలో శనివారం సాయంత్రం బలమైన భూప్రకంపనలు సంభవించాయి. దీనితీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు అయ్యింది. ఈ మేరకు USGCఅధికారులు వెల్లడించారు. భూకంప కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీచేయలేదని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, స్థానిక కాలామానం ప్రకారం రాత్రి 10.27గంటలకు సంభవించింది.

పాపువా న్యూ గినియాలో భూకంపం:
పాపువా న్యూ గినియాలో ఆదివారం బలమైన భూకంపం సంభవించింది . నివేదికల ప్రకారం, పాపువా న్యూ గినియాలోని న్యూ బ్రిటన్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది . భూకంప కేంద్రం 65 కి.మీ లోతులో ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) నివేదించింది. అయితే ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించిన వార్తలను ఇప్పటి వరకు వెల్లడించలేదు.

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం:
ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో ఆదివారం భూకంపం సంభవించింది . ఆదివారం రాత్రి 2.14 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. ప్రాణనష్టం గురించి సమాచారం లేదు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున 2.14 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు తూర్పు ఈశాన్య దిశలో 273 కి.మీ దూరంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 180 కిలోమీటర్ల లోతులో ఉందని ఆయన చెప్పారు.