అన్ని ఆఫీసుల్లోనూ ఇలాగే ఉంటే..! - MicTv.in - Telugu News
mictv telugu

అన్ని ఆఫీసుల్లోనూ ఇలాగే ఉంటే..!

July 5, 2017

ఒక్కసారి ఆఫీసులోకి ఎంటరైతే మళ్లీ ఇంటికి వెళ్లేవరకు కూర్చునే పనిచేయాలి. డెస్క్ లో కంప్యూటర్లకు అతక్కుపోవాలి. దాదాపు అన్ని ఆఫీసుల్లోనూ ఇంతే. మధ్యలో లంచ్ , టీ, టీఫిన్లకు మాత్రమే లేస్తారు. మిగతా టైమ్ అంతా కూర్చుని ఉంటూ పనులు చేస్తారు. ఇలా ఎక్కువసేపు కూర్చుని ఉంటే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నా ఉద్యోగులకు తప్పడం లేదు. ఎంప్లాయిస్ శ్రేయస్సు కోరిన ఓ కంపెనీ ఆఫీసులో నిల్చుని పనిచేసేలా ఏర్పాట్లు చేసింది.  నిర్ణయం పై ఉద్యోగులు తెగ ఖుషీ అవుతున్నారు. ఈ కంపెనీ ఎక్కడ ఉందంటే.

జపాన్ లోని ఐరీస్‌ ఒహ్యమా కంపెనీ సరికొత్త నిర్ణయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆఫీసులో ఉద్యోగులు అంతా నిల్చుని పని చేయాలని ఆర్డరేసింది.

ఆఫీసులో అన్ని కుర్చీలను తీసేంది. నిల‌బ‌డి పని చేయడం కోసం కంప్యూటర్లను ఎత్తైన టేబుల్‌పై అమర్చారు. ఉద్యోగులంతా ఆ కంప్యూటర్లను వంతుల వారీగా వాడుకోవాలి. ఒక్కోక్కరు 45 నిమిషాల చొప్పున కంప్యూటర్‌ను యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పనిపై ఏకాగ్రత…క్రియేటివిటీ పెరుగుతుందని ఐరీస్‌ ఒహ్యమా మేనేజ్ మెంట్ అంటోంది. హెల్త్ బాగాలేని ఎంప్లాయిస్ కు మాత్రం మినహాయింపు ఇచ్చింది. వారి కోసం కుర్చీలతో స్పెషల్ డెస్క్ లను ఏర్పాటు చేసింది. ప్రయోగత్మంగా చేపట్టిన ఈ విధానం విజయవంతమైతే జపాన్ వ్యాప్తంగా ఉన్న తమ అన్ని ఆఫీసుల్లో అమలు చేయాలని అనుకుంటుంది

నిల్చుని పనిచేయడం సూపర్ రూల్ కదా..అన్ని ఆఫీసుల్లోనూ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో. మన దేశంలో ఇప్పటికే కొన్ని సంస్థల్లో ఉద్యోగుల కోసం జిమ్ లు పెట్టారు. ఆఫీస్ టైమింగ్స్ లో వీటిని వాడుకోవచ్చు. ఇప్పుడు జపాన్ కంపెనీ ఐడియా కూడా ఈ సంస్థలు ఫాలో కావొచ్చు.మొత్తానికి ఉద్యోగుల హెల్త్ గురించి ఆలోచించే సంస్థలు గ్రేట్.