కరోనాపై జపాన్ విజయం.. ఆ రహస్యం ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాపై జపాన్ విజయం.. ఆ రహస్యం ఇదే

May 26, 2020

b cvgb c vgb

వ్యాపార సముదాయాలన్నీ తెరిచే ఉన్నాయి. జనం సర్వ సాధారణంగా రోడ్లపై తిరుగుతున్నారు. అయినా కూడా జపాన్‌ కరోనాను కట్టడి చేయగలిగింది. మహమ్మారి విజృంభనతో అగ్రరాజ్యం అమెరికానే సతమతమౌతుంటే జపనీయులు మాత్రం నిర్భయంగా ఉన్నారు. వీరంతా వైరస్‌ను జయించారు. లాక్‌డౌన్ ఎత్తివేసి సాధారణ జీవితం గడుపుతున్నారు. అయితే ఇదంతా ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా.? అయితే దానికి ఆ దేశం అప్రమత్తతే కారణం. 

వాస్తవానికి జపాన్‌లో తొలి కరోనా కేసు జనవరి నెలలోనే నమోదు అయ్యింది. కానీ అక్కడ వైరస్ పెద్దగా వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడ్డారు. ఇంకా మరణాల సంఖ్య కేవలం వెయ్యి లోపు మాత్రమే ఉంది. దీని కంతటికి కారణం వారంతా ఆరోగ్యం పట్ల తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కారణమని అంటున్నారు. జపనీయులకు బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించడం అలవాటు. వ్యక్తిగత శుభ్రతకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. దీంతో అక్కడ రికవరీ శాతం పెరిగి చాలా మంది వైరస్ ముప్పు నుంచి బయటపడ్డారు. దీనికి తోడు అక్కడ వైరస్ సోకిన వెంటనే ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్నవారిని ముందుగానే గుర్తించి జాగ్రత్త పడ్డారు. 

మరోవైపు వైరస్ లాంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికి 2018లోనే ఆ దేశం పెద్ద ఎత్తున వైద్య సిబ్బందిని నియమించుకుంది. దీంతో ఆ దేశంపై కరోనా పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇప్పటి వరకు జపాన్‌లో మొత్తం 16,628 మంది వైరస్ బారిన పడగా.. 13,612 కోలుకున్నారు. 851 మంది మరణించారు. ప్రతి రోజు వచ్చే కేసుల సంఖ్య కూడా సింగిల్ డిజిట్‌కు మాత్రమే పరిమితం అవుతోంది. దీంతో ఈ వైరస్‌ను సమర్ధవంతంగా తిప్పికొట్టిన దేశంగా జపాన్ రికార్డు సృష్టించింది.