ఆ కార్టూన్‌ను రూ.177 కోట్లకు కొన్నారు..మీరైతే ఎంతిస్తారు! - MicTv.in - Telugu News
mictv telugu

ఆ కార్టూన్‌ను రూ.177 కోట్లకు కొన్నారు..మీరైతే ఎంతిస్తారు!

October 9, 2019

Japanese artist's Knife Behind Back cartoon girl painting fetches Rs 177 crore at auction.

పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అంటారు. ఎవరి టేస్ట్ ఎలా ఉంటుందో అంచనా వేయడం కొంచెం కష్టమే. తాజాగా ఓ కార్టూన్ పెయింటింగ్ భారీ ధరకు అమ్ముడు పోవడం ఇందుకు నిదర్శనం. 

అది ఓ కార్టూన్. అందులో ఓ అమ్మాయి కోపంగా చూస్తున్నట్టుగా ఉంది. చూడడానికి చాలా సింపుల్‌గా ఉన్న ఈ కార్టూన్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. వేలంలో ఏకంగా రూ.177 కోట్ల రికార్డ్ ధరకు అమ్ముడుపోయింది. 2000 సంవత్సరంలో యోషాతోమో నారా అనే ఓ జపనీస్ ఆర్టిస్ట్ ‘నైఫ్ బిహైండ్ బ్యాక్’ కార్టూన్ పెయింటింగ్ వేశారు. కానీ అందులో కత్తి కనిపించదు. అమ్మాయి తన వీపు వెనుక దాచుకుందని అర్థం చేసుకోవాలి. ఈ బొమ్మను హాంగ్ కాంగ్‌లో వేలం వేశారు. వేలం పాట ప్రారంభించిన 10 నిమిషాల్లోనే ఆ కార్టూన్ పెయింటింగ్ భారీ ధరకు అమ్మడుపోవడం విశేషం.