క్వాడ్ సదస్సులో పాల్గొనడం కోసం జపాన్ పర్యనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ సోమవారం టోక్యో చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు నినాదాలు చేస్తూ, జెండాలు ఊపుతూ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో ఐదో తరగతి చదువుతున్న ఓ జపాన్ బాలుడు హిందీలో మాట్లాడి షాకిచ్చాడు. ‘జపాన్‌కు స్వాగతం, ప్లీజ్ మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి’ అని హిందీలో చెప్పడంతో ప్రధాని మోదీ ఆశ్చర్యపోయారు. అనంతరం ప్రశంసిస్తూ.. నీకు హిందీ ఎలా వచ్చని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆ బాలుడు మీడియాతో మాట్లాడుతూ.. నేను హిందీ ఎక్కువగా మాట్లాడలేను. కానీ, అర్ధం చేసుకోగలను. ప్రధాని మోదీ నా సందేశాన్ని చదివి నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | “Waah! Where did you learn Hindi from?… You know it pretty well?,” PM Modi to Japanese kids who were awaiting his autograph with Indian kids on his arrival at a hotel in Tokyo, Japan pic.twitter.com/xbNRlSUjik
— ANI (@ANI) May 22, 2022