Japanese Man, Becomes World's Oldest To Sail Solo Across Pacific
mictv telugu

ఈ ముసలోడు మామూలోడు కాదు.. మహాసముద్రాన్నే…

June 4, 2022

Japanese Man, Becomes World's Oldest To Sail Solo Across Pacific

ముసలోడే కానీ పసిఫిక్ మహా సముద్రాన్ని ఒంటరిగా చుట్టి రికార్డ్ సృష్టించాడు. జపాన్‌కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీకి సముద్ర ప్రయాణాలంటే ఎంతో ఆసక్తి. చిన్నతనం నుంచే సముద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలపై మక్కువ చూపేవాడు. 1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్‌ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించి, పసిఫిక్‌ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన ప్రంపంచలోనే తొలి వ్యక్తిగా పేరుగాంచాడు.

ఇలా సముద్రయానానికి సంబంధించిన సాహసయాత్రలను వరుసగా 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. తదనంతరం మళ్లీ ఇప్పుడూ హోరీ మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి తన తొలి సాహాసయాత్రను ప్రారంభించాడు. ఈ సాహసయాత్రను విజయవంతంగా ముగించుకుని శనివారం తెల్లవారుఝామున జపాన్‌లోని కియ్‌ జలసంధికి చేరుకోవడంతో ముగిసింది. ఈ అరుదైన సాహసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత వృద్ధుడుగా నిలిచాడు.