Japanese whiskey bottle sold for Rs.65.20 crores in auction
mictv telugu

ఒక్క పెగ్ విస్కీ ధర రూ. 4.70 కోట్లు.. ఫుల్ బాటిల్ రేటు ఎంతో చూస్తారా

September 30, 2022

Japanese whiskey bottle sold for Rs.65.20 crores in auction

మద్యం రేట్లు ఎంత పెరిగినా మందుబాబులు వెనక్కి తగ్గరు. ఎందుకంటే ఒకసారి అలవాటయితే వదలడం కష్టం కనుక. ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరుగిపోయాయి. చాలా మంది రెగ్యులర్‌గా తాగే బ్రాండ్లు కాకుండా ఈ పండుగ సందర్భంగా కొంత ఖరీదు ఎక్కువున్న మద్యాన్ని కొనుగోలు చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో జపాన్‌లో ఓ అరుదైన విస్కీ అమ్మకానికి రాగా, ఒక్క పెగ్గు ధర ఏకంగా రూ. 4.70 కోట్లకు అమ్ముడుపోయింది. అది కూడా వేలం పాటలో కావడం గమనార్హం. ఇక ఫుల్ బాటిల్ ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే. 750 ఎంఎల్ ఉన్న ఆ బాటిల్ ఖరీదు రూ. 65.20 కోట్లకు అమ్ముడుపోవడం సంచలనంగా మారింది. జపాన్‌కు చెందిన యమజాకి అనే కంపెనీ 55 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉంది. ఈ కంపెనీ 1960లో డిస్టిల్ చేసిన ఓ బాటిల్ ఖరీదు వివరాలివి. కంపెనీ వ్యవస్థాపకుడైన షింజిరో టోరీ పర్యవేక్షణలో సింగిల్ మాల్ట్‌తో తయారు చేసి చెక్కపెట్టెలో నిల్వచేశారు. అప్పటినుంచి దానిని భద్రపరచగా, దానిని ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆక్షన్ హౌస్ sothebyలో వేలం వేశారు. దీంతో మద్యం ప్రియులు అంత ధర పెట్టి కొనుగోలు చేశారు.