ఇవాంకా భర్త హోదాను తగ్గించారు - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా భర్త హోదాను తగ్గించారు

March 1, 2018

పదవులను కుటుంబ సభ్యులకు పందేరం వేస్తున్నారని, అధికారం అండతో వ్యాపారాలను పంచుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. తన అల్లుడు, తన సీనియర్ సలహాదారు అయిన జారెడ్ కుష్నర్ హోదాను ఆయన తగ్గించారు. ప్రస్తుతం టాప్‌ సీక్రెట్‌ క్లియరెన్స్‌ జాబితాలో ఉన్న కుష్నర్‌ పేరును అక్కడి నుంచి తప్పించి  సీక్రెట్‌ క్లియరెన్స్‌ జాబితాలో చేర్చారు.దీంతో.. ఇకపై శ్వేతసౌధం అధికారులకు అందే అత్యంత రహస్య నివేదికలు కుష్నర్ కు అందుబాటులో ఉండవు. కుష్నర్‌ ప్రస్తుతం పశ్చిమాసియా శాంతి చర్చలు, మెక్సికోతో సంబంధాల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. రష్యా, జర్మనీ, ఇరాన్ వంటి దేశాలు కుష్నర్ వ్యాపారాలతో లింకులు పెట్టుని అమెరికా సర్కారు రహస్యాలను చేజిక్కించుకునే ప్రమాదముందని భావిస్తున్న నేపథ్యంలో కుష్నర్ హోదాను తగ్గించారు. కుష్నర్.. ఇటీవల హైదరాబాద్‌లో సందడి చేసిన ట్రంప్ కూతురు ఇవాంకా భర్త అన్న సంగతి తెలిసిందే.