అయ్యో పాపం అనడమే  మనవంతు..! - Telugu News - Mic tv
mictv telugu

అయ్యో పాపం అనడమే  మనవంతు..!

July 11, 2017

ఈఫోటోను చూస్తుంటే  ఈదేశాన్ని తిట్టాలనిపిస్తుంది.. కానీ దేశభక్తి అడ్డం పడుతుంది,సరిగ్గా సావడానికి కూడా సదుపాయాలు లేని..70 ఏండ్ల భారతాన్ని చూసి..గట్టిగా అరవాలనుంది,కానీ అరవలేని స్థితి,అయితే మనవంతుగా అరవడాలు కరవడాలు మానేసి వాట్సప్ ఫేస్ బుక్కుల్లో..ప్రశ్నిద్దాం సరిపోతుంది.

ఈ ఫోటో గురించి మీకు తెలుసుకోవాలనుంది కదా..? గాశారం బాగలేక పాము కర్శింది, సర్కారు దవాఖాననుందనే భరోసాతోని పోతే..టైంకు పట్టిచ్చుకునే నాథుడే లేడు,ఆఖర్కి జీవి వోయినే వోయింది,అయ్యా మీకు పుణ్యంముంటది..బొందల గడ్డకు ఏస్కపోనికి కనీసం అంబులెన్స్ అన్న ఇయ్యున్రి…అని మొత్తుకున్నా.. శెవిటోని ముంగట శంఖం ఊదినట్టే జేశిన్రు,శేశేదేం లేక తోడ వుట్టిన తమ్ముని శవాన్ని.. శెరో దిక్కు వట్టుకొని..బొందల గడ్డకు మోస్కపోయిన దయనీయ పరిస్ధితి,అన్నా వదినలే  అంబులెన్సు గా మారిన వైనం.ఆ ఆడమన్షిని జూడున్రి..బిడ్డను కొంగుతో భుజాన్కి కట్టుకొని మరిది శవాన్ని మోసింది చూస్తుంటే… ఎవరి మనసైన చలించక మానదు,కానీ ఆడున్న ఒక్కల మన్సుగుడ కర్గలేదా ?అయ్యో పాపం ఆడ మన్షి కష్టపడుతుంది ఆసరా అయిదామన్న ఆలోచనే రాలేదా?, బతికున్నప్పుడు సాటి మన్షిని  ఎలాగో..లెక్క జేస్తలేం,కనీసం ఆళ్లు  సచ్చినంక గుడ మన మన్సు కర్గుతలేదంటే..రాయికంటే గట్టిగా మన మనసు మారినందుకు సంతోషిద్దామా?..జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ సర్కారు దవాఖాన దగ్గర జర్గిన దృశ్యం ఇది.ఇలాంటి దృష్యాలు చూస్తుంటే..చీ ఎందుకో ఈ మన్షి జన్మ అనిపిస్తుంది,మన్షై ఉండి సాటి మన్షిని పట్టించుకోని పురోగతి..ప్రగతి  ఎవరికోసం ఎందుకోసం.పక్కోడు ఎమైపోతే మనకేంటి బతికేద్దాం.మన్షులుగా పుట్టినందుకు గర్వపడదాం.