పాము కరిచింది.. పామును కరిచాడు.. బాలుడి రివేంజ్ - MicTv.in - Telugu News
mictv telugu

పాము కరిచింది.. పామును కరిచాడు.. బాలుడి రివేంజ్

October 31, 2022

Jashpur naglok child bites cobra in anger tapkara poisonous snakes found

ఏదో ఒకచోట ఓ మనిషిని పాము కాటేసిందనే వార్త అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కానీ కాటేసిన పామును దొరకబుచ్చకొని కొట్టి చంపడమో, లేదంటే మద్యం మత్తులో ఉన్న వారు కొరికి చంపడమో లాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ఛత్తీస్గఢ్లో ఓ పిల్లాడిని పాము కాటేసింది. అయితే తనను కాటు వేసిందన్న కోపంతో ఆ పిల్లాడు తిరిగి పామును కరిచాడు. ఈ ఘటనలో బాలుడి దెబ్బకు పాము చనిపోగా.. ఆ అబ్బాయి మాత్రం ఆరోగ్యంగా ఉన్నాడు.

జష్‌పుర్‌ జిల్లా గార్డెన్‌ డెవలప్‌మెంట్‌ బ్లాక్‌కు చెందిన పండారపథ్‌లోని కోర్వా తెగకు చెందిన దీపక్ రామ్ అనే 12 ఏళ్ల బాలుడిని పాము కాటేసింది. ఆ చిన్నారి ఆడుకుంటూ తన సోదరి ఇంటికి వెళ్తుండగా.. దీపక్ చేతికి పాము కాటేసింది. దీంతో ఆగ్రహంతో ఉగిపోయిన దీపక్‌ పారిపోతున్న పామును వెంబడించి మరీ దొరకబుచ్చుకున్నాడు. వెంటనే గట్టిగా రెండు చోట్ల కొరికేశాడు. ఈ ఘటనలో పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషయం వెంటనే చిన్నారి తన కుటుంబ సభ్యులతో చెప్పగా.. దీపక్ను ఆస్పత్రికు తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే జష్పుర్లో మనుషుల్ని పాము కరిస్తే వారు కూడా తిరిగి పామును కరవాలని.. అలా చేస్తే ఏ ప్రమాదం ఉండదని వారి నమ్మకం.