Jasprit Bumrah included in ODI squad for Sri Lanka series
mictv telugu

బూమ్..బూమ్ బుమ్రా వచ్చేశాడు..శ్రీలంకతో సిరీస్‎కు ఎంపిక..

January 3, 2023

గాయం కారణంగా జట్టుకు దూరమైన పేస్ బౌల‌ర్ జస్‌ప్రీత్ బుమ్రా టీం ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేశాడు. శ్రీలంక‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌కు అతను ఎంపికయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడ‌మీ క్లియరెన్స్ రావడంతో బుమ్రాను వన్డే జట్టులోకి తీసుకున్నారు. శ్రీలంక టూర్‌కి మొదట ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు లేనప్పటికీ తాజాగా అతనిని లిస్ట్‌లో చేర్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది.త్వ‌ర‌లోనే ఇండియా జ‌ట్టుతో బుమ్రా క‌లుస్తాడ‌ని ప్రకటన చేసింది. ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన జస్ప్రిత్ బుమ్రా, రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండంటే రెండు మ్యాచులు ఆడి తిరిగి గాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా బరిలోకి దిగలేదు. తన చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 25న ఆస్ట్రేలియాతో ఆడాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న బుమ్రా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. జ‌న‌వ‌రి ప‌దో తేదీ నుంచి భారత్-శ్రీలంక సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 3న ఇరుజట్లు మొదటి టీ20లో తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో టీ20 సిరీస్‎కు భారత్ బరిలోకి దిగుతుంది.టీ20 సిరీస్‌కు రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్.