వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న బుమ్రా.. గతేడాది సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి ప్రధాన టోర్నీల్లో సైతం బుమ్రా సేవలను భారత్ జట్టు కోల్పోయింది. ఈ ఏడాది శ్రీలకంతో సిరీస్‌కు బుమ్రాను ఎంపిక చేసినా గాయం ఇబ్బంది పడడంతో తర్వాత జట్టు నుంచి తొలగించారు. కీలకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి అందుబాటులో లేడు.
ఇప్పుడు ఐపీఎల్‌కి కూడా బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుమ్రా గాయం తీవ్రం కావడంతో ఐపీఎల్‌తో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరమవుతాడని తెలుస్తోంది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండడంతో పూర్తిగా కోలుకున్నాకే బుమ్రా బరిలోకి దిగాలనేది బీసీసీఐ ఆలోచన. ఈసారి ఎటువంటి బుమ్రా విషయంలో ఎటువంటి రిస్క్ చేయకూడదని బీసీసీఐ భావిస్తోంది
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్ట్‌ల్లో ఆసీస్‌ను చిత్తుచేసిన భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకుంది. ఈ క్రమంలో బుమ్రా వంటి కీలక బౌలర్ అందుబాటులో లేకపోవడం జట్టుకు తీరని లోటు అనే చెప్పాలి. విదేశాల్లో సత్తా చాటగలిగే భారత్ బౌలర్లలో బుమ్రా ఒకడు. అలాంటిది అతడు లేకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కు టీం ఇండియా సిద్ధం కావాలి.
బుమ్రా రూపంలో ముంబై ఇండియన్స్ గట్టి ఎదురుదెబ్బనే తగిలింది. గత సీజన్‌లో పేలవంగా ఆడిన ముంబై 2023లో రాణించాలని పట్టుబట్టి కూర్చోంది. ఈ క్రమంలో బుమ్రా అందుబాటులో ఉండడనే వార్తలు ముంబై ఇండియన్స్‌ని కలవరపెడుతున్నాయి.