శ్రీలంక సిరీస్‌కు ముందు టీం ఇండియాకు భారీ షాక్ తగిలింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు నుంచి దూరమయ్యాడు. ఇటీవల గాయం నుంచి కోలుకున్నాడని శ్రీలంక వన్డే సిరీస్‌కు బుమ్రాను ఎంపిక చేశారు. అయితే అతడు మరసారి జట్టులో స్థానం కోల్పోయాడు. పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదన్న కారణంతో జట్టు నుంచి తప్పించారు. భవిష్యత్తులో కీలక సిరీస్‌లు భారత్ ఆడనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బుమ్రాను దూరంపెట్టినట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన జస్ప్రిత్ బుమ్రా, రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండంటే రెండు మ్యాచులు ఆడి తిరిగి గాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా బరిలోకి దిగలేదు. తన చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 25న ఆస్ట్రేలియాతో ఆడాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న బుమ్రా ప్రాక్టీస్‌లో చెమటలు చిందిస్తున్నాడు. దీంతో భారత్-శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేసినట్లు చేసి మరల దూరం పెట్టారు. జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో అతనికి అవకాశం దక్కేలా ఉంది. లేదా, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో బుమ్రా బరిలోకి దొగొచ్చు. జనవరి 10 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20లకు గైర్హాజరైనా సీనియర్లు రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ జట్టుతో కలిశారు