జాతిరత్నాలు హీరోయిన్ షాకింగ్ వీడియో.. చూస్తే దిమ్మతిరిగిపోద్ది - MicTv.in - Telugu News
mictv telugu

జాతిరత్నాలు హీరోయిన్ షాకింగ్ వీడియో.. చూస్తే దిమ్మతిరిగిపోద్ది

July 7, 2022

కామెడీ హిట్ చిత్రం జాతిరత్నాలు ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. చిట్టీ పాత్రలో కామెడీతో పాటు తన క్యూట్‌నెస్‌తో యువత అభిమానాన్ని చూరగొంది. మంచి హైట్, లుక్ ఉన్న ఈమెకు పెద్ద అవకాశాలొస్తాయని అందరూ భావించారు. అయితే ఆ అంచనా గాడి తప్పింది. మరి ఎక్కడ పొరపాలు జరిగిందనుకుందో ఏమో కానీ, తనలోని టాలెంటుని చూపించే దిశగా ఆమె ఓ వీడియో రూపొందించింది. ప్రేక్షకులకు ఇంతవరకు తెలియని తనలోని టాలెంటుని ఆ వీడియోలో చూపించింది. వీడియోలో ఫరియా బెల్లీ డ్యాన్స్ చేస్తుంది. నాభి అందాలను చూపిస్తూ నడుమును షేక్ చేస్తూ చేసిన ఈ డ్యాన్సుని చూసిన నెటిజనులకు మతి పోతోంది. తనలోని డ్యాన్సర్, గ్లామర్‌లను చూపించడానికి చేస్తుందా అన్న రీతిలో ఆమె చేసిన పెర్‌ఫార్మన్స్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో పెద్ద డైరెక్టర్లు, హీరోల కంట పడితే తాను స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమని ఈ భామ నమ్ముతోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)