Javed Akhtar's comments on Pakistan went viral
mictv telugu

పాక్ ప్రజలు మంచోళ్లు.. బాంబులు పేల్చే రకం కాదని చెప్పారా?

February 21, 2023

Javed Akhtar's comments on Pakistan went viral

పాకిస్తాన్‌పై ఆ దేశంలోనే బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ మాటల తూటాలు పేల్చారు. దిగ్గజ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ సంస్మరణార్ధం ఇటీవల లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొనగా, అక్కడున్న వారు అక్తర్‌ని పలు ప్రశ్నలు అడిగారు. ‘మీరు ఎన్నోసార్లు పాకిస్తాన్‌కి వచ్చారు. మీదేశం వెళ్లిన తర్వాత పాకిస్తానీయులు మంచోళ్లు.. బాంబులు పేల్చే రకం కాదు. పూలమాలతో ప్రేమను కురిపిస్తారని ఎప్పుడైనా చెప్పారా? అనే ప్రశ్నకు జావేద్ ధీటుగా బదులిచ్చారు. ‘రెండు దేశాల మధ్య ద్వేషం సమస్యను పరిష్కరించదు. ఇరు దేశాల మధ్య వాతావరణం వేడిగా ఉంది. ముంబైవాసులమైన మేము టెర్రరిస్ట్ దాడులను కళ్లారా చూశాం.

వారు ఎక్కడో నార్వే లేదా ఈజిప్టు నుంచో రాలేదు కదా. వాళ్లు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆ చేదు అనుభవంతో భారతీయుల మనసులో కోపం ఉంటుంది. దానిపై మీరు ఫిర్యాదు చేయడానికి వీల్లేదు’ అంటూ తీవ్రంగా స్పందించారు. అంతేకాక, ‘మేము మీదేశంలోని కళాకారుల సంస్మరణ సభలకు వస్తున్నాం. కానీ మీ దేశంలో ఎప్పుడైనా లతా మంగేష్కర్ కోసం సంస్మరణ సభ పెట్టారా? అని నిలదీశారు. ఈ సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు శెభాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాటలతోనే పాకిస్తాన్ గడ్డపై సర్జికల్ స్ట్రైక్ చేశారంటూ ప్రశంసిస్తున్నారు.