JNU Recruitment 2023 : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో 388 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈరోజే చివరి తేదీ. - MicTv.in - Telugu News
mictv telugu

JNU Recruitment 2023 : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో 388 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈరోజే చివరి తేదీ.

March 10, 2023

JNUలో ప్రభుత్వ ఉద్యోగాలు లేదా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ కోరుకునే అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక. దేశంలోని సెంట్రల్ యూనివర్శిటీలలో ఒకటైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో అన్ని నాన్ టీచింగ్ పోస్టుల కోసం మొత్తం 388 ఖాళీల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం, 10 మార్చి 2023తో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు NTA రిక్రూట్‌మెంట్ పోర్టల్, recruitment.nta.nic.inలోని లింక్‌ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు గ్రూప్ ఎ పోస్టులకు రూ. 1500, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు రూ. 1000 ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు గ్రూప్ ఏ పోస్టులకు రూ.1000, గ్రూప్ బీ/సీ పోస్టులకు రూ.600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది . అదే సమయంలో, దివ్యాంగులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. JNUలో నాన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను NTA ఫిబ్రవరి 20, 2023న ప్రారంభించింది.

JNU రిక్రూట్‌మెంట్ 2023: ఈ పోస్టుల కోసం JNU రిక్రూట్‌మెంట్ జరగనుంది:

– డిప్యూటీ రిజిస్ట్రార్ – 2 పోస్టులు
– అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 3 పోస్టులు
– పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ – 1 పోస్ట్
– సెక్షన్ ఆఫీసర్ – 8 పోస్టులు
– సీనియర్ అసిస్టెంట్ – 8 పోస్టులు
– అసిస్టెంట్ – 3 పోస్టులు
– జూనియర్ అసిస్టెంట్ – 106 పోస్టులు
– మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 79 పోస్టులు
– ప్రైవేట్ సెక్రటరీ – 1 పోస్ట్
– పర్సనల్ అసిస్టెంట్ – 6 పోస్టులు

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేసుకోవచ్చు.