శ్రద్ధా వాకర్ హత్య.. కీలక ఆధారాలు దొరికాయి - MicTv.in - Telugu News
mictv telugu

శ్రద్ధా వాకర్ హత్య.. కీలక ఆధారాలు దొరికాయి

November 21, 2022

దేశవ్యాప్త సంచలనమైన శ్రద్దావాకర్ హత్య కేసులో దర్యాప్తు సంస్థలకు సోమవారం కీలక ఆధారాలు లభించాయి. ఓ ప్రదేశం నుంచి ఒక దవడ ఎముక, మరికొన్ని మానవ అవశేషాలను వెలికితీశారు. శ్రద్ధా వాకర్ తల భాగాన్ని ఛత్రపూర్ లోని ఓ పెద్ద చెరువులో వేసినట్టు నిందితుడు చెప్పడంతో చెరువులో ఉన్న మొత్తం నీటిని తోడేందుకు ప్రయత్నించారు.

కానీ సాధ్యం కాకపోవడంతో గజ ఈతగాళ్లను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఇక అఫ్తాబ్ పూనావాలను విచారించే కొద్దీ కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ముంబై నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయిన పూనావాలా.. అందుకోసం 37 బాక్సులను వినియోగించాడు. ఇందుకు గాను గుడ్ లక్ అనే కొరియర్ సంస్థకు రూ. 20 వేల బిల్లును చెల్లించాడు. ఇక ఈ ఘటన వెలుగులోకి రాకముందే అతని కుటుంబం పాల్ ఘర్ నుంచి వెళ్లిపోయింది.