జయలలితకు భారీ మొత్తంలో స్టెరాయిడ్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

జయలలితకు భారీ మొత్తంలో స్టెరాయిడ్లు..

December 13, 2017

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం సహజమైంది కాదనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆమెకు భారీ మోతాదులో ప్రమాదకరమైన స్టెరాయిడ్లు ఇచ్చారని ఆమెకు ఆక్యుపంక్చర్ వైద్యం చేసిన శంకర్ అనే వైద్యుడు తెలిపాడు. జయ మృతికేసుపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ముందు శంకర్  మంగళవారం హాజరయ్యారు.‘జయ అనారోగ్యానికి అసలు కారణం స్టెరాయిడ్లే. ఆమె అస్వస్థతకు గురయ్యాక ఆస్పత్రిలో చేర్చడానికి ముందు ఇంట్లో చికిత్స చేశారు. మోతాదుకు మించి స్టెరాయిడ్లు ఇచ్చారు. ఇవి ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. ఆమె శరీర స్వభావానికి ఈ మోతాదు స్టెరాయిడ్లు హానికరం.. ’ అని శంకర్ చెప్పారు.

ఈ కేసులో ఆర్ముగస్వామి కమిషన్.. జయ బంధువులను, ఆమె వద్ద పనిచేసిన అధికారులను విచారిస్తోంది. త్వరలోనే శశికళను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. ఆస్పత్రిలో జయను చూడ్డానికి తమకు అనుమతివ్వలేదని ప్రభుత్వ వైద్యులు ఇటీవల చెప్పడం తెలిసిందే. జయ గదిలో కేవలం శశికళ, ఆమె బంధువులు మాత్రమే గడపడంతో అందరి వేళ్లూ శశికళపైకే వెళ్తున్నాయి.