అమ్మను మర్చిపోయారా..... - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మను మర్చిపోయారా…..

July 20, 2017

పవర్ ఉంటేనే అన్నీ సెట్ అవుతాయి. ఎక్కడా లేని భక్తి టన్నుల కొద్ది తన్నుకుని బయటకు వస్తుంది. వద్దన్నా కాళ్ల దగ్గర  పడి మరీ ఫోటోలు తీసుకుంటారు. భక్తి ఇంకాస్త ఎక్కువైతే పత్రికల్లో, టీవిల్లో యాడ్స్ ఇచ్చి తమకెంతటి భక్తి ఉందో చూపెట్టుకుంటారు. తమిళనాడులో అయితే ఇది మరింత ఎక్కువనే ఉంటుంది. జయ బతికున్నన్ని రోజులు అంతా అమ్మ జపం చేశారు. తెల్లటి అంగీలు వేసుకుని  జేబులో అమ్మ ఫోటో కన్పించేలా  కెమెరాల ముందుకు వచ్చే వారు. ఇంకొంత మంది అయితే రోజూ గాలి పీలుస్తున్నామంటే అమ్మనే కారణం అనే లెవల్లో చెప్పుకునే వారు. అయితే ఇప్పుడు ఎక్కడా అమ్మ ఫోటో నే కాదు అమె పేరు కూడా ఎవ్వరూ ఎత్తడం లేదట.  బడ్జెట్ కాపీల మీద కూడా అమ్మ ఫోటో పెట్టుకునే వారు. మంత్రులు, నాయకుల టేబుళ్ల మీద తమ ఫోటోలున్నా  లేకున్నా అమ్మ ఫోటో మస్ట్ గా పెట్టే వారు. ఇప్పుడు ఎవ్వరి టేబుల్ పైనా అమ్మ చిత్రమే  లేదట. ఇదేం చిత్రమో మరి.

ఇక్కడ భక్తి కొన్ని సార్లు పీక్ స్టేజీలో ఉండేది. తమ పదవులు పీకేసినా అమ్మకు ప్రేమతో అంటూ పత్రికల్లో ఫుల్  పేజీ యాడ్స్ కలర్ ఫుల్ గా ఇచ్చుకుని అమ్మ నిర్ణయం ఎంత గొప్పదో చెప్పకునే వారు. అట్లా చేసుకున్న వారు కొందరు పళని స్వామి  వర్గంలోనూ ఉన్నారు. ఎంపిలు, సీనియర్ల సంగతి సరేసరి.

అమ్మ చనిపోయిన తర్వాత  కొద్ది రోజుల పాటు పన్నీర్ సెల్వంతో పాటు అందరూ పోటీలు పడి అమ్మ జపం చేశారు. పొద్దున నిద్ర లేచింది మొదలు అమ్మ సమాధి దర్శనం చేసుకుని… అమ్మ పేరు జపించి తమ భక్తిని చాటుకున్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో అమ్మ డెడ్ బాడీనీ డూప్లీకేట్ తయారు  చేయించి మరీ ప్రచారం చేసుకున్నారు. జైళ్ల ఉన్న శశికళ కూడా అమ్మ పేరు  ఎత్తకుండా పనులు మొదలు పెట్టేదే కాదు. ఇప్పుడు ఆమె అమ్మ గురించిన ప్రస్తావన కూడా తేవడం లేదట.

అధికారంలో ఉన్నప్పుడు… అందరూ అమ్మ… అమ్మా… అనే వారు. రాజకీయ భవిష్యత్తు అందరిదీ గందరగోళంలో పడిందనే బాధనో లేక పోతే ఇప్పుడు అమ్మ అవసరం లేదనో తెలియదు కానీ. మరి యాదృచ్ఛికమొ తెలియదు.  అమ్మ ఫోటోలు కానీ.. అమ్మ ప్రస్తావన కానీ నాయకులెవ్వరూ పెద్దగా తేవడం లేదని తమిళనాట టాక్ నడుస్తున్నది.