జయ తండ్రిని చంపింది ఆమె తల్లే! - MicTv.in - Telugu News
mictv telugu

జయ తండ్రిని చంపింది ఆమె తల్లే!

December 5, 2017

మీరు హిట్ మూవీ ‘మాయాబజార్’ సినిమా చూశారా? అందులో కృష్ణుడి భార్య రుక్మిణిగా నటించింది సంధ్య. ఆమె ఎవరో కాదు.. తమిళనాడు దివంగత సీఎం జయలలిత తల్లి. జయ అనుమానాస్పద మృతి, ఆమె కూతర్నంటూ అమృత అనే బెంగళూరు యువతి కోర్టు కెక్కడంతో ఇప్పుడు  మీడియా జయ పుట్టుపూర్వోత్తరాలను తోడుతోంది. ఆమె మేనేత లలిత మీడియాతో పలు విషయాలు పంచుకుంటున్నారు.

జయలలితకు ఒక కూతురు పుట్టిన మాట నిజమేనని లలిత ఇటీవల బాంబు పేల్చడం తెలిసిందే. ఆమె ఇప్పుడు మరో సంచలన విషయం బయటపెట్టారు. జయ తండ్రి జయరామన్‌ను చంపేసింది సాక్షాత్తూ జయ తల్లి సంధ్యనే అని చెప్పారు. జయరామన్ మద్యానికి బానిస కావడంతో సంధ్య అతనికి స్వయంగా విషం పెట్టి చంపిందన్నారు.

జయరామన్ హత్య తరువాత  సంధ్య వేధింపులను భరించలేక తాము ఆమె దూరంగా వెళ్లిపోయామన్నారు. జయరామన్ చనిపోయాక సంధ్య.. జయలలిత సినిమాల్లోకి పట్టుకెళ్లిందన్నారు. జయకు కాన్పు చేసింది తన పెద్దమ్మేనని, అయితే, పుట్టిన బిడ్డ అమృతేనని చెప్పడానికి తన వద్ద ఆధారాలు లేవని అన్నారు. తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని జయలలిత తమతో ఒట్టు వేయించుకుందని లలిత వెల్లడించారు.