జయంతి ఆరోగ్యం విషమం.. కృత్రిమ శ్వాసపై.. - MicTv.in - Telugu News
mictv telugu

జయంతి ఆరోగ్యం విషమం.. కృత్రిమ శ్వాసపై..

March 27, 2018

సీనియర్ నటి జయంతి(73) ఆరోగ్యం విషమించింది. ఆమెకు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆమె కొన్నాళ్లుగా ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. చిన్నపాటి చికిత్స కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నామని, పూర్తి వివరాలను ఇప్పుడే చెప్పలేమని వైద్యులు తెలిపారు. కీలక అవయవాలు మొరాయించాయని, ఆమె పరిస్థితి విషయమించిందని, కృత్రిమ శ్వాస అందిస్తున్నారని  వార్తలు వస్తున్నాయి.

అయితే తన తల్లి చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, ఆందోళనపడాల్సిన అవసరం లేదని జయంతి కుమారుడు కృష్ణకుమార్ తెలిపారు. జయంతి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో 500 సినిమాల్లో నటించారు. ఆమె బళ్లారిలో జన్మించారు. తర్వాత మద్రాసుకు మారారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర హీరోలతో నటించారు. కన్నడ నాట అప్పట్లో జయంతి సూపర్ స్టార్.