రాష్ట్ర విభజనతో మేలు జరిగింది.. జేపీ   - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్ర విభజనతో మేలు జరిగింది.. జేపీ  

March 17, 2018

సీనియర్ రాజకీయ నాయకుడు, సామాజిక విశ్లేషకుడు,  లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణతో మైక్ టీవీ సతీష్ జరిపిన ముచ్చట ఇది. వర్తమాన రాజయాలు, రాష్ట్ర విభజన, ఏపీ, తెలంగాణ దశదిశలు వంటి ఎన్నో అంశాలపై తన అభిప్రాయాలను, ఆకాంక్షలను నిక్కచ్చిగా వివరించారు.

‘మనది అపరిపక్వ సమాజం.. ప్రజా సంక్షేమంలో మన ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థలు విఫలమయ్యాయి. రాష్ట్ర విభజనతో మేలు జరిగింది. అభివృద్ధి విషయంలో  హైదరాబాద్‌పైనే కాకుండా ఇతర జిల్లాలపైనా దృష్టి సారించారు..ఇది చాలా సానుకూల అంశం’ అని వివరించారు. పార్టీలు ప్రజల విశ్వసనీత సాధించాలని, ప్రజాస్వామ్య, సహకార వ్యవస్థలు బలోపేతం కావాలంటూ దేశ, తెలుగు రాష్ర్టాల స్థితిగతులను లోతుగా విశ్లేషిచారు.

‘మన దేశంలో రాజకీయాలు నడపడం చాలా కష్టం. విదేశాల్లో మాదిరి అన్నీ వాటికవి జరిగిపోయే పరిస్థితి లేదు. ఇక్కడ పెద్ద యత్రాంగం, వ్యవస్థ ఉన్నాయి. అందుకే లంచాలు వంటి సమస్యలు.. పార్టీలపై తీవ్ర ఒత్తిడి ఉంది. కష్టం పడ్డాం కనుక అధికారం, పదవులు కావాలనే ధోరణి పెరిగింది. అందుకే పోటీ. ఈ పరిస్థితి మారాలి…లోక్‌సత్తా ఈ మార్పు కోసం యత్నించింది. మాకు ఒక్క ఎంపీ లేకపోయినా మూడు రాజ్యాంగ సవరణల్లో కీలక పాత్ర పోషించాం… ’ అని తెలిపారు.

రాష్ట్ర విభజనతో మేలు జరిగిందని, అయితే గుణాత్మక మార్పులు ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు. కులవ్యవస్థ, అవినీతి, ఏపీకి ప్రత్యేక హోదా, అధికార వికేంద్రీకరణ, విద్య, ఆరోగ్యం, నిరుద్యోగం వంటి మరెన్నో అంశాలపై ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. పార్టీలు ఉద్రేకాలు రెచ్చగొడితే రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయేమోగాని, దేశానికి, ప్రజలకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. తన బాల్యం, విద్య, ఐఏఎస్ పదవి వంటి వ్యక్తిగత వివరాలను కూడా పంచుకున్నారు.