Home > Featured > కాళేశ్వరం, దళితబంధులపై జయప్రకాశ్ నారాయణ సంచలనవ్యాఖ్యలు

కాళేశ్వరం, దళితబంధులపై జయప్రకాశ్ నారాయణ సంచలనవ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలైన దళిత బంధు, కాళేశ్వరం ప్రాజెక్టులపై లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ నిర్మాణాత్మక విమర్శలు చేశారు. ప్రపంచంలోని ఏ ప్రభుత్వం కూడా ప్రతీ కుటుంబానికి నేరుగా రూ. 10 లక్షలు ఇవ్వదని అన్నారు. దళితుల కోసమే దళిత బంధు పథకం తీసుకొస్తే మిగతా కులాల్లోని నిరుపేదల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఒక కులానికి ఇచ్చి మరో కులానికి ఇవ్వకపోతే సమాజంలో అశాంతి చెలరేగే ప్రమాదముందని హెచ్చరించారు. కులం ప్రాతిపదికన కాకుండా ఆర్ధికంగా పేదవారికి ఇలాంటి పథకాలు వర్తింపజేస్తే వారు ఎదగడానికి అవకాశం ఉంటుందని సూచించారు. నిజాం నవాబు మాదిరి డబ్బులు పంచడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ తప్పని తాను ఆనాడే చెప్పానని పునరుద్ఘాటించారు. అలాగే రాష్ట్రాల అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక సంక్షోభాన్ని చూసిన తర్వాత కేంద్రంలో మార్పు వచ్చిందని, రాష్ట్రాల అప్పులపై, దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు ఆహ్వానించదగ్గవని పేర్కొన్నారు. రాష్ట్రాలు తీసుకుంటున్న అధిక అప్పులపై ఫైనాన్స్ కమిషన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తే ఆర్ధిక సమస్యలు రావని వెల్లడించారు.

Updated : 24 July 2022 3:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top