కలెక్టర్‌కే చుక్కలు చూపించిన ప్రభుత్వ అధికారులు... - MicTv.in - Telugu News
mictv telugu

కలెక్టర్‌కే చుక్కలు చూపించిన ప్రభుత్వ అధికారులు…

October 10, 2018

ప్రభుత్వాధికారులు కరెక్ట్ సమయానికి కార్యాలయాలకు రారనీ, అదేవిధంగా పనులు కూడా చేయరనే అపవాదు వుంది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడిన ఘటనలను చాలానే చూశాం. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులు ప్రజలను ఇబ్బంది పెడితే ఏం లాభం అనుకున్నారో ఏమో?  ఏకంగా కలెక్టర్‌కే చుక్కులు చూపించారు. Jayashankar Bhupalapalli District Officials What could have been a profit if people were upset? The collector pointed at the uniform.తెలంగాణలో అసెంబ్లి ఎన్నికల నేఫథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)లను జిల్లా కేంద్రంలోని మినీ ఫంక్షన్ హాలులో ఉంచారు. వాటి ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఫంక్షన్ హాలుకు వచ్చారు. కలెక్టర్ వస్తున్నారని తెలిసికూడా అధికారులు హాలు తాళాలు తీసుకురాలేదు. గత్యంతరం లేక కలెక్టర్ అక్కడే 10 నిమిషాల పాటు వేచి వున్నారు. చివరికి ఓ ఉద్యోగి తాళాలు తెచ్చి హాలును తెరవడంతో కలెక్టర్ లోపలకు వెళ్లారు. ఈ ఘటనతో స్థానిక సిబ్బందిపై ఎమ్మార్వో సత్యనారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కలెక్టర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.