సినీ తరాల వ్యక్తిగత విషయాలు, రహస్యాలు వంటివి సోషల్ మీడియాలో రాకెట్ స్పీడ్ తో వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల నుండి సహజ నటి జయసుధ వ్యక్తిగత జీవితంపై షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. అదే జయసుధ మూడో పెళ్లి వవ్యవహారం. ఇందులో నిజమెంతుందో కానీ తమిళ మీడియా ఎక్కువగా ఈ రూమర్ ని స్ప్రెడ్ చేస్తుంది. ఆమె ఇటీవలే రహస్యంగా ఒక బిజినెస్ మెన్ ని మూడవ పెళ్లి చేసుకున్నట్టు న్యూస్ వస్తుంది. ఫిలిప్ రూయెల్స్ అనే వ్యక్తితో జయసుధ క్లోజ్ గా మూవ్ అవుతుందని.. పబ్లిక్, ప్రయివేట్ ఈవెంట్స్ కి ఫిలిప్ రూయెల్స్ ని వెంటేసుకుని వెళ్తుందని.. ఈ నేపథ్యంలో అతనితో రహస్య వివాహం అయినట్టు భారీగా జరుగుతున్నా ప్రచారంపై తాజాగా జయసుధ స్పందించింది.
ఫిలిప్ రూయెల్స్ తన బయో పిక్ తీయడానికి అమెరికా నుండి ఇండియా వచ్చాడని.. బయో పిక్ రీసెర్చ్ కోసం తన వెంట ట్రావెల్ అవుతున్నాడని తాజాగా క్లారిటీ ఇచ్చింది జయసుధ. తన గురించి ఆయన ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేసి పలు వివరాలు తెలుసుకున్నారట. ఆ తర్వాత బయోపిక్ తీయాలనుకున్నారట. ఇటీవల అమెరికా వెళ్లినప్పుడు కూడా జయసుధ అక్కడ రూయెల్స్ ని కలసి వచ్చారట. అయితే ఇక్కడ జయసుధకు ఉన్న ఫాలోయింగ్ ఏంటి, ఆమెకు ఉన్న స్నేహితులెవరు, ఇలాంటి వివరాల కోసం రూయెల్స్ ఇండియాకు వచ్చారని చెబుతున్నారు జయసుధ. అంతే కాని ఆయనతో ఇంకేమీ సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయితే జయసుధ క్లారిటీపై నెటిజన్స్ కామెడీ చేస్తున్నారు. ఇండియాలో ఇంతమంది మేకర్స్ ఉంటే.. సినిమాలకి సంబంధం లేని వ్యక్తి అమెరికా నుండి వచ్చి జయసుధ బయో పిక్ తీయాలా అని సెటైర్స్ వేస్తున్నారు.