కరోనా వారియర్స్ కోసం.. 211 మంది సింగర్స్ పాట పాడారు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వారియర్స్ కోసం.. 211 మంది సింగర్స్ పాట పాడారు

May 17, 2020

211 Singers

కరోనా నేపథ్యంలో ఇప్పటికే భారతీయ భాషలన్నింటిలో ఎన్నో పాటలు వచ్చాయి. తెలుగులో ఓ సినిమా కూడా రాబోతోంది. వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ కూడా వచ్చాయి. కవితలు, కథలు కూడా అల్లేస్తున్నారు. ఈ క్రమంలో 211 మంది భారత గాయకులు కరోనాపై ఓ పాట పాడారు. కరోనా పోరాట యోధుల గురించి వారు ఈ పాట పాడారు. కరోనాపై పోరాటంలో ప్రజల్ని కాపాడేందుకు వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్య కార్మికులు చేస్తున్న త్యాగాలు  అన్నీ ఇన్నీ కావు. తమ ప్రాణాలకు తెగించి వారు ఈ పోరులో భాగమయ్యారు. వారికి సంఘీభావంగా గాయకులు ఈ పాటను ఆలపించారు.

‘జయతు జయతు భారతం’  అంటూ సాగే ఈ పాటను దేశ వ్యాప్తంగా ఉన్న 211 మంది గాయకులు పాడారు. గాయకులు ఆశాభోంస్లే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, కైలాశ్ ఖేర్, శంకర్ మహదేవన్, ఉదిత్ నారాయణ్ వంటి సీనియర్ గాయనీ గాయకులు ఇందులో భాగం పంచుకున్నారు. ఈ పాటను మొత్తం 14 భాషల్లో (తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళం,, కన్నడ, మలయాళం, భోజ్‌పురి, అస్సామీ, కశ్మీరీ, రాజస్థానీ, ఒడియా,  సింధీ) భాషల్లో పాడారు. ఈ పాటపై బాలీవుడ్ గాయని ఆశాభోంస్లే స్పందిస్తూ.. కరోనా కష్ట కాలంలో కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతి భారతీయుడికి సంఘీభావంగా 14 భాషల్లోని ఈ చారిత్రాత్మక గీతం అంకితం చేయబడిందని వెల్లడించారు.